- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmal: అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దారుణానికి ఒడిగట్టాడు
by Ramesh Goud |
తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు మహిళపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్(Surgical Blade) తో దాడి చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు మహిళపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడ్(Surgical Blade) తో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ పట్టణం(Nirmal Town) సోఫీ నగర్(Sofi Nagar) లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం నిర్మల్ కు చెందిన దివ్య అనే మహిళ సంతోష్ అనే యువకుడికి కొంత నగదు అప్పుగా ఇచ్చింది. శుక్రవారం సంతోష్ కనిపించగా.. తన డబ్బు తిరిగి చెల్లించాలని దివ్య పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సంతోష్ సర్జికల్ బ్లేడ్ తో దివ్యపై దాడికి తెగబడ్డాడు. కోపంతో మహిళ గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమణించిన స్థానికులు దివ్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దివ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story






