- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరసన తప్ప మాకు మరో మార్గం లేదు
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో నర్సింగ్ సిబ్బంది సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్

దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో నర్సింగ్ సిబ్బంది సమస్యలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నా, ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నెల డిసెంబర్ 8 నుంచి శాంతియుత నిరసన కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు నిమ్స్ నర్సెస్ యూనియన్ ప్రకటించింది. యూనియన్ ఇప్పటికే నవంబర్ 12, నవంబర్ 20, డిసెంబర్ 3 తేదీల్లో మూడు సార్లు లేఖలు ఇచ్చినా... యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని యూనియన్ నేతలు విమర్శించారు. ఈఎల్ ఇన్‌కాష్‌మెంట్‌ను నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించినట్లుగా అమలు చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచాలని, మహిళా ఉద్యోగులకు మూడునెలల చైల్డ్ కేర్ లీవ్, ఖాళీలను భర్తీ చేసి కాంట్రాక్ట్ నర్సులపై పెరుగుతున్న భారం తగ్గించాలని, క్లినికల్ నర్సింగ్ ఆఫీసర్స్, కాలేజ్ నర్సింగ్ స్టాఫ్ క్యాడర్ రివ్యూ చేయాలని, నర్స్-పేషెంట్ రేషియో సరిచేసి వర్క్‌లోడును తగ్గించాలని... తదితర సమస్యల పరిష్కారం కోసం నిమ్స్ నర్సెస్ యూనియన్ గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా... ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించింది. రోగులకు అందించే సేవలు, సంస్థ పని తీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే సంగతి తెలిసినా.. తమ సమస్యలను పట్టించుకోని పరిస్థితుల్లో తమకు నిరసన తప్ప మరో మార్గం లేదని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆశాలత, కృష్ణ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు యూనియన్ అధికారికంగా యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.






