Nilofer Hospital: లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-22 01:24:35  IST  )

హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌(Masab Tank)‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల బాలుడు (Boy) లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడిన విషయం తెలిసిందే.

Nilofer Hospital: లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ (Masab Tank)‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల బాలుడు(Boy) లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన బాలుడు ఏడుస్తూ కేకలు వేశాడు. గమనించిన అపార్ట్‌మెంట్‌ వాసులు వెంటనే అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది వెల్డింగ్‌ మిషన్‌ల సాయంతో లిఫ్ట్‌ డోర్‌లు తొలగించి బాలుడిని బయటకు తీ నీలోఫర్‌ ఆసుపత్రి (Nilofer Hospital)కి తరలించారు.

తాజాగా బాలుడి ఆరోగ్య పరిస్థితి సూపరింటెండెంట్‌ (Nilofer Superintendent) ప్రకటన విడుదల చేశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. శరీర లోపలి భాగాలు పూర్తిగా నలిగిపోయి దెబ్బతిన్నాయి. లిఫ్ట్‌లో రెండు గంటల పాటు అవస్థలు పడ్డారు. ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ ఆగిపోయింది. చికిత్స అందిస్తున్నప్పటికీ బాలుడి పరిస్థితి సీరియస్‌గానే ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story