- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ప్రతిష్టాత్మక అవార్డ్ గెల్చుకున్న స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్
by Satheesh |
భారత స్టార్ బాక్సర్, తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: భారత స్టార్ బాక్సర్, తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జరీన్ తండ్రి ఎండీ జమీల్ అహ్మద్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరీన్ క్రీడాకారిణిగా రాణించి ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. తండ్రిగా చేసింది కొంతేనని భావోద్వేగానికి గురయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
Next Story






