NHRC: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్సీ షాక్

by Prasad Jukanti |

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్సీ షాక్ ఇచ్చింది.

NHRC: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్సీ షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కంచగచ్చిబౌలిలోని (Kanche Gachibowli Lands) హెచ్ సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసం పై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) చర్యలు చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government), పోలీసు అధికారులపై కేసు నమోదు చేసింది. ఈ విషయంలో గతంలో ఎన్ హెచ్ఆర్సీలో ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం, పోలీసులపై కేసు నమోదు చేసినట్లు రామారావు ఇమ్మానేనికి ఎన్ హెచ్ ఆర్సీ తాజాగా లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చింది. కాగా గతంలో చేసిన సర్వే స్కెచ్ లో ఈ ప్రాంతంలో 27 ఎకరాల సరస్సు, 134.28 ఎకరాల షీట్ రాక్స్, 2.33 ఎకరాల కుంటతో పాటు రాష్ట్ర జంతువు మచ్చల జింకలు కూడా ఉన్నాయని ఈ జింకలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని న్యాయవాది ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు.

Next Story