- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాలు లేకపోతే జీవనం ఎలా..? డీహెచ్ క్యాంపస్‌లో ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల ఆందోళన
గత రెండు నెలలుగా వేతనాలు లేవని, జీతం లేకుంటే జీవనం ఎలా సాగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం)లో గత అనేక ఏళ్లుగా పనిచేస్తున్న 17541 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత రెండు నెలలుగా వేతనాలు లేవని, జీతం లేకుంటే జీవనం ఎలా సాగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ ప్రశ్నించారు. గురువారం ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కోఠి డీహెచ్ క్యాంపస్ లో ధర్నా చేపట్టారు. ఎన్.హెచ్.ఎం స్కీంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పేద, మధ్యతరగతికి చెందిన వారని, వీరంతా నిత్యం పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు. జీతాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్.హెచ్.ఎంలో దాదాపు 78 రకాల క్యాడర్ల ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరందరికీ కేడర్ ఫిక్సేషన్ చేసి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం ఇవ్వాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్నా అధికారుల నిర్లక్ష్యం వలన కనీస వేతనాలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ స్కీంలో ఉద్యోగులకు అటు కేంద్ర ప్రభుత్వ బేసిక్ గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వ బేసిక్ గాని ఇవ్వకుండా శ్రమదోపిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు రావలసిన రెండు నెలల జీతాలు, పీఆర్సీ బకాయిలకై బేసిక్ శాలరీ కోసమై రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మె సైతం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15600 చెల్లించాలని ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. అనంతరం చీఫ్ ప్రోగ్రాం ఆఫీసర్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేయగా.. ఈ నెల చివరి లోపు జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల అంజయ్య , సిద్దిపేట రాజేశ్వరి రెడ్డి, ఆచంట అభిషేక్, ఎల్. సురేష్ నాయక్, జాయింట్ సెక్రటరీ జి.జ్యోతి, డీపీఓల యూనియన్ అధ్యక్షులు సిద్ధార్థ, తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.






