- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామగుండంలో భూకంపం..అసలు వాస్తవం ఇదే !
తెలంగాణలోని ( Telangana ) రామగుండంలో (Ramagundam ) భూకంపం ( Earthquake) వస్తుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ( Telangana ) రామగుండంలో (Ramagundam ) భూకంపం ( Earthquake) వస్తుందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దింతో రామగుండం వాసులు గజ గజ వణికిపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే రామగుండంలో భూకంపం రావడంపై NGRI క్లారిటీ ఇచ్చింది. రామగుండంలో భూకంపం రావొచ్చంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడం పై స్పందించింది.
అది పూర్తిగా అవాస్తవమని అంటూ NGRI శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూకంపం ( Earthquake) వచ్చే సమయాన్ని, స్థానాన్ని, తీవ్రతను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూకంపాల విషయంలో తెలంగాణ దేశంలోనే అత్యంత సురక్షిత ప్రాంతమని తేల్చి చెబుతున్నారు శాస్త్ర వేత్తలు ( Scientists).
ఇది ఇలా ఉండగా నిన్నటి నుంచి తెలంగాణ కు భూకంప ( Earthquake) హెచ్చరికలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగుండం లో అధిక తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని... ఎపిక్ ఎర్త్ క్వేక్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంప ( Earthquake) తీవ్రత హైదరాబాద్, వరంగల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 17వ తేదీన ఏ రోజైనా భూకంపం రావచ్చు అని హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు NGRI శాస్త్రవేత్తలు. భూకంపం రావడం అసాధ్యమని వివరించింది.






