డ్రైవర్ అశోక్‌ని తొలగించారన్న వార్తలు అవాస్తవం- మంత్రి పొన్నం

by velandi.Saikiran |

జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్‌ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

డ్రైవర్ అశోక్‌ని తొలగించారన్న వార్తలు అవాస్తవం- మంత్రి పొన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జగిత్యాలలో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్‌ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అతను కేవలం ఆర్టీసీ హైర్ (కిరాయి)బస్సు డ్రైవర్ అని, ఆర్టీసీ ఉద్యోగి కాదని పేర్కొన్నారు. అయినప్పటికే అతన్ని తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించామని తెలిపారు. అశోక్ రైతుల పక్షాన మాట్లాడారు, దాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, అయినా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దని హితవు పలికారు.

Next Story