- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.200 నోటు బ్యాన్ అంటూ వార్తలు.. ఆర్బీఐ కీలక ప్రకటన
రూ. 200 నోట్లు బ్యాన్ (200 Note Ban) అంటూ వస్తున్న వార్తలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank Of India) కీలక ప్రకటన (Statement) చేసింది.

దిశ, వెబ్ డెస్క్: రూ. 200 నోట్లు బ్యాన్ (200 Note Ban) అంటూ వస్తున్న వార్తలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (Reserve Bank Of India) కీలక ప్రకటన (Statement) చేసింది. ఇటీవల మార్కెట్‌లో రూ.200. రూ.500 నకిలీ నోట్లు (Fake Notes) గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు (Complaints) వస్తున్నాయి. పోలీసులు (Police) కూడా కొన్ని చోట్ల దాడులు చేసి, దొంగ నోట్ల ముఠాలను (Fake Notes Gang) అరెస్ట్ (Arrest) చేశారు. దీంతో ఈ నోట్లను బ్యాన్ చేయాలని ఆర్బీఐ (RBI) నిర్ణయించిందని, త్వరలో బ్యాన్ దిశగా అడుగులు వేస్తోందని వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ (Clarity) ఇచ్చింది. రూ.200 నోట్లు బ్యాన్ చేస్తారని వస్తున్న వార్తలను కొట్టిపారేసింది.
రూ. 200 నోట్ల రద్దు లాంటి ఆలోచనలు, ప్రకటనలు ఏవి లేవని స్పష్టం చేసింది. నోట్ల బ్యాన్ లాంటి వార్తలు నమ్మొద్దని సూచించింది. మార్కెట్లో నకిలీ నోట్లు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నకిలీ నోట్లను గుర్తించేందుకు అందరూ అవగాహనతో ఉండాలని తెలిపింది. మీ దగ్గర ఉన్నది నకిలీ నోటు (Fake Note) అని అనుమానం వస్తే.. వెంటనే ఆ నోటును ఈ విధంగా చెక్ చేసుకోవాలని కొన్ని గుర్తులను సూచించింది. రూ.200 నోటుకు ఎడమవైపు దేవనాగరి లిపిలో 200 అని రాసి ఉంటుందని, మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందని తెలిపింది. అలాగే "RBI", "Bharat", "India" తో పాటు "200" అని సూక్ష్మ అక్షరాలతో రాసి ఉంటుందని చెప్పింది.
ఇక కుడివైపున అశోక స్థూపం గుర్తు ఉంటుందని, ముందుగా గ్రీన్ కలర్ లో ఉండి, నోటును అటు ఇటు తిప్పుతుంటే బ్లూ కలర్ లోకి మారుతూ ఉంటుందని వివరణ ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం కొత్త నోట్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అనంతరం ఇటీవలే రూ.2000 నోట్లు బ్యాన్ చేసి, ప్రజల వద్ద ఉన్న నోట్లను తిరిగి తీసుకున్నది. ఇప్పటి వరకు దాదాపు 98 శాతం 2 వేల నోట్లు ఆర్బీఐ కి చేరాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ రూ. 500 నోట్లను బ్యాన్ చేయనుందని, నకిలీ నోట్లను కట్టడి చేసేందుకు 200 నోట్లను కూడా బ్యాన్ చేయాలని నిర్ణయించిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.






