- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన కేబినెట్ సమావేశం.. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో.. 2027 గోదావరి పుష్కరాల పనులకు రూ.1000 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.. తొలివిడతగా రూ.300 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. BSF, CISF గ్రూప్ సెంటర్లకు తెలంగాణలో భూములు కేటాయించింది. కరీంనగర్లోని వెలిదిలో నాలుగు ఎకరాలు, రుక్మాపూర్ లో ఐదెకరాలు, గన్నేరువరంలో మరో 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇందిరమ్మ రెండో విడత ఇళ్లపై కేబినెట్ లో చర్చించామని, మూడు - నాలుగు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. అర్హులైనవారికి తమ నియోజకవర్గాల్లోనే ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 18,500 పూరిగుడిసెలు గుర్తించామని, స్థలాలు ఉన్న వారందరికీ ఈ నెలాఖరులో ప్రొసీడింగ్స్ మొదలవుతాయని పేర్కొన్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు కూడా త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా జూన్ 1న ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమవుతాయని, రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లను అర్హులకు అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు.






