- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం..
ఆదివారం ఉదయం నగరంలోని జేఎన్టీయూ వంతెనపై ఓ రెడ్ కలర్ కారు బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: వీకెండ్ వస్తే చాలు.. నగరంలో యువతీ, యువకులు ఫుల్లుగా తాగి రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగడం పరిపాటిగా మారింది. ఆదివారం ఉదయం నగరంలోని జేఎన్టీయూ వంతెనపై ఓ రెడ్ కలర్ కారు బీభత్సం సృష్టించింది. సుమారు 7.50 గంటల సమయంలో రైతుబజార్ దాటిన తర్వాత వంతెనపైకి ఎక్కిన కారు.. ఓర్ స్పీడ్ తో డివైడర్ ను ఢీ కొట్టి, టూ వీలర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టూ వీలర్ పై ఉన్న వ్యక్తికి గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. యువకులు ఇద్దరు సూడాన్ దేశానికి చెందినవారుగా గుర్తించారు. ముగ్గురు యువతులు మరో క్యాబ్ బుక్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోగా.. యువకులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా.. ఆ కారును అద్దెకు తీసుకున్నారా ? లేదా ఎవరైనా ఇచ్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకులు శంషాబాద్ లో ఉంటూ చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.






