- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయం కేసీఆర్‍నే అడగాలి.. చిట్ చాట్‍లో రేవంత్ రెడ్డి కామెంట్స్
కేసీఆర్ ఇవాళ సభకు వచ్చి త్వరగా వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: శాసనసభలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సభకు వచ్చి త్వరగా వెళ్లిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. కేసీఆర్ (KCR) వెంటనే ఎందుకు వెళ్లారన్నది ఆయననే అడగాలన్నారు. ఈ రోజే కాదు ఆసుపత్రిలో కూడా కేసీఆర్‍ను తాను కలిశానని గుర్తు చేశారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో శాసన మండలి (Telangana Legislative Council) భవనం పునర్నిర్మాణ పనులను వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు పూర్తిచేయాలనుకుంటున్నామని చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి సెంట్రల్ హాల్ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో ఇక్కడికి యాక్సెస్ ఉంటుందని మాజీ ఎమ్మెల్యేలలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తామని చెప్పారు. మరో వైపు అసెంబ్లీలోని తన ఛాంబర్‍లో మంత్రులు, విప్‍లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.






