- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు సీరియల్ నటికి ప్రైవేట్ పార్ట్ వీడియోలు.. నిందితుడి వివరాలు తెలుసుకుని పోలీసులు షాక్
తెలుగు, కన్నడ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న మహిళా యాక్టర్ కు లైంగిక వేధింపులు కలకలం సృష్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగు, కన్నడ సీరియల్ నటికి అశ్లీల వీడియోలు, సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు (TV Actor sexual harassment) గురి చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ మేనేజర్ కటకటాల పాలయ్యాడు. బెంగళూరుకు చెందిన 41 ఏళ్ల నటికి ఓ వ్యక్తి నుంచి ఫేస్ బుక్ లో (Facebook harassment) రిక్వెస్ట్ వచ్చింది. ఆమె తిరస్కరించడంతో అతడు రాక్షసంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. తరచూ అశ్లీల సందేశాలు పంపించడం ప్రారంభించాడు. అలా చేయవద్దని అనేక సార్లు సదరు నటి హెచ్చరించినా అవతలి వైపు నుంచి వేధింపులు ఆగలేదు. కొత్త కొత్త ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రైవేట్ పార్ట్ ల వీడియోలను మెసెంజర్ కు పంపడం మొదలు పెట్టాడు. దీంతో అతడి చేష్టలకు విసిగెత్తిపోయిన నటి చివరకు బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులను (Bengaluru police) ఆశ్రయించింది. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు ఆ కేటుగాన్ని అదుపులోకి తీసుకుని అతడి వివరాలు తెలుసుకుని షాక్‍కు గురయ్యారు. నటిని వేధించిన వ్యక్తి ఓ బహుళజాతి సంస్థలో డెలివరీ మేనేజర్‍గా పని చేస్తున్న నవీన్ కే మోన్ గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.






