- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
‘మోంథా’ తుపాను కారణంగా తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ‘మోంథా’ తుపాను కారణంగా తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, గత రాత్రి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని అంతర్వేదిపాలెం వద్ద ‘మోంథా’ తుపాను తీరాన్ని తాకింది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
అదేవిధంగా మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ ఎల్లో అలర్ట్ జారీ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో మహబూబ్‌నగర్ డీఈవో ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ (Advait Kumar Singh) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతో నేటి త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి (Anudeep Durisetty), ఇలా త్రిపాఠి సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






