- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీలు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి తప్ప బీసీలకు రిజర్వేషన్లు రావు: ఆర్.కృష్ణయ్య
జాజుల,ఆర్. కృష్ణయ్య కలయికపై వస్తున్న ఆరోపణల పట్ల బీసీ జేఏసీ చైర్మన్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు అధికారం అధికారం ఆత్మగౌరవం కోసమైతే అగ్రకులాలకు అధికారం వారి ఆస్తులను కాపాడుకోవడానికి అని ఈ రెండింటికి చాలా తేడా ఉందని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) అన్నారు. రెడ్లలో పెదలు ఉన్నారని వారి సంక్షేమం కోసం రెడ్లు స్కీమ్‍లు అడగాలన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍తో మాట్లాడిన కృష్ణయ్య.. బీసీ రిజర్వేషన్లు, బీసీ ఉద్యమంపై (BC reservations movement) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ జేఏసీలో మరిన్ని సంఘాలను చేర్చుకుంటామని, బీసీ బంద్‍ను ఊరూరుకు తీసుకువెళ్తామన్నారు. మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఇదే తరహాలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇదే తరహా కేసును కొట్టి వేస్తే అక్కడ ఉద్యమాలు జరగలేదు. కానీ తెలంగాణలో తొలిసారి గ్రామాల్లోనూ స్వచ్ఛందగా బంద్ జరిగిందని గుర్తు చేశారు. బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్.కృష్ణయ్య కలయికపై వస్తున్న ఆరోపణలపై కృష్ణయ్య స్పందించారు. అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud), కృష్ణయ్య బీసీల్లో పుట్టిన కౌరవులు అంటూ జస్టిస్ ఈశ్వరయ్య పోల్చారంటూ అడిగిన ప్రశ్నకు స్పందించిన కృష్ణయ్య.. జస్టిస్ ఈశ్వరయ్య తమను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నారు. ఈశ్వరయ్య పెద్దవారు.. గౌరవనీయులు.. కానీ నేను ఇంత కాలం దేనికోసం పోరాటం చేస్తున్నాను? గ్రూప్-1 ఉద్యోగం తో పాటు అనేక ఉద్యోగాలు వచ్చిన వదులుకుని ఉద్యమం చేశానన్నారు. నాకు స్పష్టమైన ఎజెండా ఉందని నేను ఎవరి ట్రాప్ లో పడబోనన్నారు. ఈ వయసులో తనకు కొత్తగా ఏమి అవసరం లేదన్నారు.
42 శాతం రిజర్వేషన్ల సాధన సమితికి, బీసీ జేఏసీకి మధ్య బిన్నాభిప్రాయాలు ఉన్నాయని రిజర్వేషన్ల సాధన విషయంలో ఎంచుకున్న మార్గాలు వేరన్నారు. 9వ షెడ్యూల్ లో పెట్టాలని వారు కొట్లాడుతుంటే 9వ షెడ్యూల్ విషయంలో ఇంకా అనేక కేసులు నడుస్తున్నాయని రాజ్యాంగ సవరణ జరిగితే చాలు అని మేము పోరాటం చేస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల కు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆ బాధ్యతను కాంగ్రెస్ తన భుజాన వేసుకోవాలన్నారు. పార్లమెంట్ లో ఇండియా కూటమి పోరాటం చేయాలన్నారు.
బీజేపీపై అబద్ధ ప్రచారాలు మానుకోవాలని బీసీని ప్రధాన మంత్రిని చేసింది బీజేపీ పార్టీ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ బీసీ అభ్యర్థికి టికెట్ అవ్వలేదు అని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ బీజేపీ ఏకంగా బీసీ సీఎంను ప్రకటించిందన్నారు. 8 మంది ఎంపీలు రాజీనామా ఉప ఎన్నికలు వస్తాయి తప్ప బీసీ రిజర్వేషన్లు రావని అన్నారు. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలన్నారు. మొన్నటి బంద్ తో కేంద్రం ఆలోచనలో పడిందని ఇదే తరహాలో మరోసారి బలమైన ఉద్యమాలు చేస్తే రిజర్వేషన్లు వస్తాయన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయని కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.






