రిపోర్టును బయటపెట్టకుండా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యామంటే ఎలా..? అడ్వొకేట్ మయూర్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-11 10:05:40  IST  )

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది.

రిపోర్టును బయటపెట్టకుండా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యామంటే ఎలా..? అడ్వొకేట్ మయూర్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు (High Court) స్టే విధించాడాన్ని సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. మరోవైపు 50 శాతం రిజర్వేషన్లు మించకుండా పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లాలనే ప్రభుత్వ నిర్ణయంపై పిటిషనర్ తరఫు లాయర్ మయూర్ రెడ్డి (Mayur Reddy) స్పందించారు.

హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే.. బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే చేశామని చెబుతోందని, కానీ, ఆ రిపోర్టును బహిర్గతం చేయడం ఎందుకు లేదన్నారు. రిపోర్టును బయటపెట్టకుండా ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యామంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అనేది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని అన్నారు. అదే వాదనను తాము హైకోర్టులో బలంగా వినిపించామని తెలిపారు. మా వాదనలతో ఏకీభవించిన కోర్టు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరఫు లాయర్ అన్నారు.

Next Story