- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ్ వర్సెస్ లోకల్.. మార్వాడీ ఘటన మరువక ముందే మరో వివాదం
కీసరలో బైక్, ఆటో పార్కింగ్ వివాదం ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 'మార్వాడీ గోబ్యాక్' (Marwadi Go Back) ఆందోళనలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. గత ఆగస్టులో ఓ కార్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు మార్వాడీలకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారులు రాష్ట్రవ్యాప్త బంద్‍కు పిలుపు ఇచ్చే వరకు ఈ వివాదం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. అంతలా షేక్ చేసిన మార్వాడీ వర్సెస్ లోకల్ ఇష్యూ మరువక ముందే అచ్చం అదే తరహాలో ఇప్పుడు లోకల్ వర్సెస్ తమిళ్ (local vs Tamil) వివాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారింది.
కర్రలతో దాడికి వచ్చిన తమిళ్స్:
తాజాగా మేడ్చల్ జిల్లా కీసరలో (Keesara) స్థానిక ఆటో డ్రైవర్‍కు ఓ తమిళ వ్యక్తికి మధ్య జరిగిన చిన్న వివాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. తన ఆటోకు బైక్ అడ్డుగా ఉందని దాన్ని తీయాలని ఆటో డ్రైవర్ కోరాడు. దాంతో తననే బైక్ తీయమంటావా అంటూ ఓ తమిళియన్ బూతులతో విచురుకుపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీకి రావాలని ఆటో డ్రైవర్ పిలవగా ఇరు వర్గాలు తమ తమ మనుషులతో వచ్చి రచ్చ చేశారు. ఇందంతా దసరా పండగకు ముందు జరిగింది. విషయం పోలీసులకు చేరడంతో పండగ తర్వాత మాట్లాడుదామంటూ ఇరువర్గాలను శాంతింపజేసి అక్కడి నుంచి మంపించివేశారు. ఇవాళ ఇరు వర్గాలు పంచాయతీ కోసం రాగా తమిళ వ్యక్తి తరఫున ఓ ముఠా కర్రలతో పంచాయతీ వద్దకు చేరుకుంది. అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ ముదరడంతో పరస్పరం కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో తమిళ వ్యక్తి తరఫున వచ్చిన ముఠా కర్రలతో బెంబేలెత్తించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో బేగంబజార్‌లో బైక్‍పై వచ్చిన స్థానిక వ్యక్తి, మార్వాడీ వ్యక్తిని పార్క్ చేసిన కారును తీయని కోరడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత అది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో ఈ ఇష్యూ తీవ్ర కలకలం రేపింది. తాజాగా కీసరలో మొదలైన బైక్ వర్సెస్ ఆటో వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.






