- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కొత్తగా నియమితులైన మంత్రి, డిప్యూటీ స్పీకర్ భేటీ
తెలంగాణలో కొత్తగా ముగ్గరు మంత్రులుగా, ఒకరు డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్తగా ముగ్గరు మంత్రులుగా, ఒకరు డిప్యూటీ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఇవాళ (సోమవారం) జూబ్లీహిల్స్ నివాసంలో (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ (Ramachandra Nayak) నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి శాలువ కప్పి సత్కరించారు. మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి (Vivek Venkata Swamy), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్ రాంచంద్రు నాయక్ ప్రమాణం చేశారు. ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా సాదాసీదగా ఆదివారం రాజ్‌భవన్‌లోని ధర్బార్ హాల్లోనే ప్రమాణ కార్యక్రమాన్ని ముగించారు. పది నిమిషాల్లో ప్రమాణ కార్యక్రమం ముగిసింది.






