IAS ఆఫీసర్స్‌ క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్, సీఎస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-31 17:03:48  IST  )

నగరంలోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌ (IAS Officers Association Club)లో 2026 నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.

IAS ఆఫీసర్స్‌ క్లబ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్, సీఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌ (IAS Officers Association Club)లో 2026 నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఆయనతో పాటు వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు (K Rama Krishna Rao), అనేకమంది సీనియర్ IAS అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పలువురు అధికారులను అప్యాయంగా పలుకరిస్తూ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు పరిపాలనలో శాఖలు, అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.

Next Story