వాహనదారులకు అలర్ట్: అక్టోబర్ 3 నుండి కొత్త రూల్స్.. బ్రేక్ చేస్తే జేబుకు చిల్లే..!

by Disha Web Desk 19 |
వాహనదారులకు అలర్ట్: అక్టోబర్ 3 నుండి కొత్త రూల్స్.. బ్రేక్ చేస్తే జేబుకు చిల్లే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జంట నగరాల్లో అక్టోబర్ 3 నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. నగరంలో భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు రూల్స్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. దీనితో రూల్స్ అతిక్రమించే వాహనదారుల జేబుకు చిల్లుపడటం ఖాయం. ఇకపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్ విధించనున్నారు.

అలాగే, ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే రూ.1000 జరిమానా విధిస్తారు. పాదచారులకు ఆటంకం కలిగించేలా ఫుట్ పాత్‌లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రూ.600 ఫైన్ విధించనున్నారు. కాగా, ట్రాఫిక్ పోలీసులు తీసుకువచ్చిన ఈ రూల్స్ అక్టోబర్ 3వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే హెల్మెట్ లేకుండా రోడ్డు ఎక్కితే భారీగా చలానాలు విధిస్తున్న పోలీసులు.. నగరంలో రోజరోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు.

Also Read: పండక్కి ఊరెళ్తున్నారా.. రాచకొండ పోలీసుల కీలక సూచనలు

Next Story