sports policy : త్వరలో క్రీడాకారులకు శుభవార్త.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-06-23 07:47:50  IST  )

స్పోర్ట్స్ పాలసీపై మంత్రి వాకిటి శ్రీహకి కీలక వ్యాఖ్యలు చేశారు.

sports policy : త్వరలో క్రీడాకారులకు శుభవార్త.. మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీ తీసుకురాబోతున్నామని దానిలో అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్య ఇస్తామని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. త్వరలోనే క్రీడా పాలసీకి (Sports Policy) రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుందని చెప్పారు. సీఎం కప్ పోటీలను నిర్వహించి గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయికి వెళ్లేలా ప్రోత్సహిస్తామన్నారు. ఇందుకోసం ప్రసిద్ధి చెందిన కోచ్ లను నియమిస్తామన్నారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఒలింపిక్ పథకాలు సాదించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఇప్పటికే బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ పోస్టులు ఇచ్చి గౌరవంగా సన్మానించామన్నారు.

ఒలింపిక్ డే సందర్భంగా ప్రభుత్వం శుభవార్త:

ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ ఐటీ శాఖల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ (Jayesh Ranjan).. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుభవార్త చెబుతుందని అన్నారు. ఈరోజు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభఉత్వం త్వరలో తీసుకురాబోతున్న క్రీడా పాలసీకి ఆమోదం తెలపనుందని చెప్పారు.ఒలింపిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలి తమ సత్తాను చాటుతున్నాయని చెప్పారు.

Next Story