- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కొత్త స్వయం సహాయక బృందాలు.. అంతా టీనేజ్ అమ్మాయిలతోనే..
టీనేజ్ బాలికలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామని, వారికి పౌష్టికాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు.

టీనేజ్ బాలికలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామని, వారికి పౌష్టికాహారంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. 14 నుంచి 18 ఏళ్లలోపు కిశోర బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పల్లీ పట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని చెప్పారు. ఎన్ఐఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్‌వాడీ వాహనాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ గుడ్లు, ఆహారం చేస్తున్నామన్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే.
ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్ పాస్ చేయడం సరికాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారని అన్నారు. రాహుల్ గాంధీకి, తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమని, తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఎవర్నీ నమ్మించాల్సిన పని లేదన్నారు. బయట ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి, కేకేకు కీలక బాధ్యతలను అప్పగించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
రాజధాని అమరావతి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఏపీకి ఆత్మవంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై ఎన్డీఏ నేతలతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి రాజధాని ఉండాలన్నారు. మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఎం పలు కీలక విషయాలను వెల్లడించారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చోలేనని సీపీఎం నేత శ్రీనివాస రావుకు ఏపీ డిప్యూటీ స్పీకర్రఘురామకృష్ణరాజు వార్నింగ్ఇచ్చారు. ఉండిలో రఘురామ ప్రోద్బలంతో 800 కుటుంబాలను రోడ్డు పాలు చేశారని ఇటీవల శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. 600 ఇళ్లను నేలమట్టం చేసేందుకు సిద్ధమయ్యారని, బ్రిటీష్ కాలం నాటి 1905 చట్టం ప్రకారం కూల్చివేతల నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని రూ.వేల కోట్లు ఎగ్గొట్టాడని రఘురామపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. ఆయన సీపీఎం నేతకు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చూడండి.






