CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో నూతన ఆర్టీఐ కమిషనర్ల భేటీ

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం తాజాగా నలుగురు సమాచార ఆర్టీఐ కమిషనర్లను నియమించిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో నూతన ఆర్టీఐ కమిషనర్ల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం తాజాగా నలుగురు సమాచార ఆర్టీఐ కమిషనర్ల(New RTI Commissioners)ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి‌ని కుటుంబ సమేతంగా నూతన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్‌, మొహిసినా పర్వీన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువలు కప్పి పుష్పగుచ్చం అందజేశారు.

కాగా, గత కొన్నేళ్లుగా ఆర్టీఐ కమిషనర్ పదవులు ఖాళీగా ఉండటంతో, పౌరులకు సమయానికి సమాచారం లభించడంలో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా నియామకాలు చేపట్టడం పౌర హక్కుల పరిరక్షణలో కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం నియమితులైన కమిషనర్లు వేర్వేరు రంగాల్లో అనుభవం కలిగి ఉన్నవారు. వారి అనుభవం సమాచార హక్కు అమలులో నాణ్యతను మెరుగు పరచడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story