- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ration Cards : కాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో మరికొద్దిసేపట్లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది.

దిశ, వెబ్తె, డెస్క్ : తెలంగాణలో మరికొద్దిసేపట్లో కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) లాంఛనంగా ప్రారంభించనున్నారు. తిరుమలగిరిలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సీఎం 11 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జాయింట్ నల్గొండ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ తదితరులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 50,000 మంది హాజరయ్యే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ కార్యక్రమంతో మొదలవుతుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 94.72 లక్షల కుటుంబాలలో 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. కొత్త కార్డుల కోసం రూ. 1,200 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.






