- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New Ration Cards : కొత్త రేషన్ కార్డులు ఉగాదికే
తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల(News Ration Cards) పంపిణీకి ముహూర్తం ఖరారైంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల(News Ration Cards) పంపిణీకి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఉగాది(Ugadi) నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ కార్డులు ఇక కొత్త విధానంలో ఉండబోతున్నాయి. ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్(QR Code) తోపాటు, లైట్ బ్లూ కలర్లో కార్డులు ఉండనున్నాయి. కార్డులపై ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఫోటో, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Utham Kumar Reddy) ఫోటో ఉండనున్నాయి. ముందుగా కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి జారీ చేసి.. అనంతరం అందరికీ దశల వారీగా ఈ కొత్త కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం.
అయితే రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామసభలు, మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తులు 13 లక్షల వరకు స్వీకరించింది. ఇవే కాకుండా కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్ మార్పునకు సంబంధించినవి 24 లక్షల వరకు వచ్చాయి. వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించిన ప్రభుత్వం.. కొత్త కార్డులు జారీ చేసేముందు, రేషన్ కార్డుల రూపు రేఖలు కూడా మార్చాలని నిర్ణయించారు. ఏటీఎం కార్డుల మాదిరిగా ప్రత్యేక చిప్ ఉండేలా లేదా క్యూఆర్ కోడ్ ఉండే కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నాలుగునెలల క్రితం కర్నాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు అధికారులు వెళ్లి అక్కడ రేషన్ పంపిణీ, కార్డుల విధానంపై అధ్యయనం చేసి వాటి తరహాలోనే ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 1న లక్ష కొత్త కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినా.. కొన్ని సాంకేతిక కారణాలతో కార్డుల పంపిణీ వాయిదా వేశారు. ఎట్టకేలకు ఉగాది రోజున కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.






