సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. ఈ నంబర్‍కు ఫోన్ చేస్తే మీ ఫోన్ పని ఖతం

by Prasad Jukanti |   (  Updated:2025-11-29 07:14:19  IST  )

సైబర్ నేరగాళ్లు మరోకొత్త తరహా మోసానికి తెరలేపారు.

సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. ఈ నంబర్‍కు ఫోన్ చేస్తే మీ ఫోన్ పని ఖతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు (Cyber ​​Crime) పంజా విసురుతున్నారు. ఆమాయకులను దోచుకునేందుకు రోజుకో పన్నాగం వేస్తున్నారు. ఇన్నాళ్లు రకరకాల పద్ధతుల్లో మోసానికి పాల్పడిన ఈ కేటుగాళ్లు తాజాగా 'ఫోన్ కాల్' (Phone call fraud) మోసానికి తెరలేపారు. ఈస్కామ్‍లో ఒక్క ఫోన్ కాల్‍తో మీ ఫోన్ అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఉండటంతో ఈ తరహా మోసం ఇప్పుడు అందరిని ఆందోళన కలిగిస్తోంది. డెలివరి బ్లూ డార్ట్ సేవల పేరుతో ఈ మోసం జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‍లోని ఓ సీనియర్ జర్నలిస్ట్ కే కేటుగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నించి విఫలమయ్యారు. శనివారం ఉదయం సదరు జర్నలిస్ట్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. డెలివరీ బ్లూడార్ట్ (Delivery Blue Dart) నుంచి మాట్లాడుతున్నాం. మీ అడ్రస్ దొరకడం లేదు. మా డెలివరీ ఏజెంట్ మీ ఏరియాలోనే ఉన్నారు. డెలివరీ బాయ్ ఫోన్ నంబర్ పంపిస్తున్నాం. అతడికి ఫోన్ చేయండి అంటూ అవతలి వైపు నుంచి చెప్పారు. డెలివరీ బాయ్ నంబర్ గా *21*9123114243 సూచించిస్తూ ఈ నంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని గ్రహించిన సదరు జర్నలిస్టు వారితో సంభాషణను అంతటితో అపేశారు. అయితే ఈ నంబర్ ఫార్వర్డ్ మెసేజ్ కు సంబంధించిన కోడ్ అని వారు చెప్పినట్లుగా ఈ నంబర్ డయల్ చేస్తే మనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్,మెసేజ్ ఇకపై సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతాయని ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా గత ఆదివారం తెలంగాణలో ఏపీకే పైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఎస్ బీఐ ఖాతాలకు మీ కేవైసీ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూప్ లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఏపీకే ఫైల్స్ ఎటాక్‍లో ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు సంబంధించిన వాట్సాప్ మీడియా గ్రూపులు సైతం ఎఫెక్ట్ అయిన సంగతి తెలిసిందే.

Next Story