- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sridhar Babu: కొత్త యుగానికి కొత్త బాటలు: మంత్రి శ్రీధర్ బాబు
ప్రణాళికబద్ధమైన నగరం కోసం ఫ్యూచర్ సిటీ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూసేలా ప్రపంచంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‍గా నిలిచేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధమైన నగరం అనగానే అందరికీ చంఢీఘర్ గుర్తుకొస్తుంది. రాబోయే రోజుల్లో ప్రణాళికాబద్ధమైన నగరం అంటే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ గుర్తుకొచ్చేలా ఈ సిటీ నిర్మించబోతున్నామన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన, రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన శ్రీధర్ బాబు. ‘లివ్ – లెర్న్ – వర్క్ – ప్లే’ అనే కాన్సెప్ట్ తో పరిశ్రమలు, ఆసుపత్రులు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ అన్ని ఒకే చోట ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు.
కొత్త యుగానికి కొత్త బాటలు:
భావి తరాల కోసం, మన బిడ్డల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు మనందరం కలిసి వేస్తున్న పునాదే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అని ఇది కొత్త యుగానికి కొత్త బాటలు అని చెప్పారు. ఇది ‘నెట్ జీరో కార్బన్ సిటీ’. ఇక్కడ పచ్చదనం ఉంటుంది, కాలుష్యం ఉండదని పరిశ్రమలు వస్తాయి, కానీ పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెప్పారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో పాలు పంచుకుని... రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. రేపటి తరాల కోసం... తెలంగాణ కోసం చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు.






