సామాజిక న్యాయానికి కేరాఫ్ కాంగ్రెస్.. డిప్యూటీ సీఎంతో కొత్త మంత్రుల భేటీ.. ఆరోగ్య మంత్రితో అడ్లూరి

by Ramesh Naini |

ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.

సామాజిక న్యాయానికి కేరాఫ్ కాంగ్రెస్.. డిప్యూటీ సీఎంతో కొత్త మంత్రుల భేటీ.. ఆరోగ్య మంత్రితో అడ్లూరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)తో భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ ప్రజా భవన్‌లో భట్టి విక్రమార్కను వాకిటి శ్రీహరి (Vakiti Srihari), అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన రామచంద్రు నాయక్ (Ramachandra Nayak) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha)ని తన నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు అడ్లూరిని మంత్రి దామోదర అభినందించి, ఆశీర్వదించారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దామోదర ఈ సందర్భంగా సూచించారు. సామాజిక న్యాయానికి కేరాఫ్ కాంగ్రెస్ (Congress) అని మంత్రి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల గణన, బీసీల రిజర్వేషన్ల పెంపు, మంత్రి వర్గంలో నలుగురు ఎస్సీలకు స్థానం‌ కల్పించడం‌, స్పీకర్‌గా అవకాశం ఇవ్వడం వంటి అంశాలను గుర్తు చేసుకున్నారు.

Next Story