DGP: సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.. దిశ పత్రికతో నూతన డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతన డీజీపీగా నియామకం అయినా ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి తెలిపారు.

DGP: సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలి.. దిశ పత్రికతో నూతన డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ విధి నిర్వహణ సవాళ్ళతో కూడి ఉన్నదని, సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తామని, పోలీస్ విభాగంలో అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని నూతన డీజీపీగా నియామకం అయినా ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా శనివారం దిశ పత్రికతో శివధర్ రెడ్డి మాట్లాడారు. డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇటివల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగి కొన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయన్నారు. వాటి ద్వారా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు. ఇతరులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్, గంజాయి పై అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈగల్ టీమ్‌కు డ్రగ్స్ నియంత్రణలో పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీ స్థాయి నుంచి డీజీ స్థాయి దాకా పనిచేశానని రాష్ట్రంపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. డ్రగ్స్ వైపు యువత వెళ్లవద్దని సూచించారు. ఇది పోలీసుల తనిఖీలతో నిర్మూలన కాదని ప్రజల్లో అవగాహన రావాలన్నారు. అక్రమ సరఫరా పై సమాచారం ఇస్తూ పెద్దఎత్తున సహకరించాలన్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న క్రమంలో ప్రజలుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ సెక్యూరిటీ వింగ్ లో డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేసుల దర్యాప్తు చేస్తూ దేశంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

Next Story