డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కొత్త సీఎస్ రామకృష్ణా రావు

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులైన విషయం తెలిసిందే.

డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన కొత్త సీఎస్ రామకృష్ణా రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary Telangana Government)గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు (Rama Krishna Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రగతి భవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను (Deputy CM Mallu Bhatti Vikramarka)ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావుకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్‌కు బ్యాచ్​చెందిన రామకృష్ణా రావు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ (Department of Finance) బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖలో చేసిన ఆయన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణా రావును సీఎస్‌గా నియమించింది. గతంలో ఆయన నల్లగొండ (Nalgonda) జాయింట్​కలెక్టర్‌గా, గుంటూరు (Guntur) జిల్లా కలెక్టర్‌గా కూడా పని చేశారు.

Next Story