- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP : ఏపీలో రూ.9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
ఏపీ(AP) ప్రభుత్వం రూ.9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల(New Bullet Proof Vehicles) కొనుగోలు(Purchase)కు నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) ప్రభుత్వం రూ.9.2 కోట్లతో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల(New Bullet Proof Vehicles) కొనుగోలు(Purchase)కు నిర్ణయం తీసుకుంది. 10 కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబుతో పాటు వీఐపీల భద్రత కోసం ప్రభుత్వ కొత్త వాహనాల కొనుగోలుకు రాష్ట్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
వాటి బుల్లెట్ ప్రూఫ్ ఫ్యాబ్రికేషన్ కోసం రూ. 9.20 కోట్లు కేటాయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు ముఖ్యులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వీఐపీలకు రక్షణగా ఈ వాహనాలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడు వీఐపీలు పర్యటిస్తున్నారు. వారికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ప్రభుత్వంలోని పెద్దలు సైతం తరచు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరో వైపు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుపై వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మె్ల్యే టి.చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక పరిస్థితిలో ఉంటే, జగన్ ఆర్ధిక విధ్వంసం చేస్తే... అక్షరాలా రూ.10 కోట్లు ఖర్చు చేసి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు చంద్రబాబు గారు...? అంటూ ప్రశ్నించారు. హామీలు అమలు చేయకుండా రోడ్డు మీద తిరిగితే జనాలు తిరగబడతారని భయమా అని ఎద్దేవా చేశారు.






