వీళ్లు లేడీలా.. రౌడీలా..? షర్మిల, విజయమ్మలపై నెటిజన్లు ఫైర్

by Disha Web Desk 19 |
వీళ్లు లేడీలా.. రౌడీలా..? షర్మిల, విజయమ్మలపై నెటిజన్లు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వీళ్లు లేడీలా ? రౌడీలా?. విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకోవడం ఏంటి. అమ్మ, కూతురు ఇద్దరికి ఏమైందో అసలు అంటూ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విధుల్లో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులపై షర్మిల చేయి చేసుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలతో సహా నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోమవారం సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన షర్మిలను పోలీసులు లోటస్ పాండ్ వద్ద అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను నెట్టేశారు. అనంతరం ఓ సందర్భంలో విజయమ్మ కూడా మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీంతో నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. అమ్మ, కూతుళ్లిద్దరికి ఒళ్లు బలుపు ఎక్కువైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసుల పట్ల షర్మిల, విజయమ్మల వ్యవహరించిన తీరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read..

పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)

కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన YS విజయలక్ష్మి (వీడియో)



Next Story

Most Viewed