సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో హిందీలో బోర్డులు.. తెలుగులో కూడా పెట్టాలని నెటిజన్ల డిమాండ్

by Ramesh Naini |   (  Updated:2025-10-07 10:36:38  IST  )

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో హిందీ బోర్డులతో పాటు తెలుగు బోర్టులు కూడా ఏర్పాటు చేయాలని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో హిందీలో బోర్డులు.. తెలుగులో కూడా పెట్టాలని నెటిజన్ల డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Secunderabad Railway Station) సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో హిందీ బోర్డులతో పాటు తెలుగు బోర్టులు కూడా ఏర్పాటు చేయాలని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక భాష తెలుగు కంటే హిందీకి ప్రాధాన్యత ఇస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్‌లో తెలుగులో కూడా బోర్డులు స్పష్టంగా ఉండాలని, స్థానిక భాషకు గౌరవం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ‘సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో RailOne ఆప్ ఎలా వాడాలో హిందీలో బోర్డులు పెడుతున్నారు. తెలుగులో బోర్డులు పెట్ట‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకొన‌గ‌ల‌రు’ అని తాజాగా ఎక్స్ వేదికగా విజయ్ అనే యూజర్ దక్షిణ మధ్య రైల్వేకు ఫోటో షేర్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్‌లు ఎక్స్ వేదికగా స్పందించారు. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే పట్టించుకోవని, ఇక హిందీ రుద్దుడు ప్రభుత్వ సంస్థలు ఎందుకు పట్టించుకుంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల వరకు తిరిగే రైళ్లలో కూడా హిందీ రాస్తారు, కానీ మన భాషను ఉత్తరాన రాయరు, దీనిని ఒప్పుకుంటే రేపు ప్రతీ చోటా దేశం అన్న పేరుతో హిందీ ఇరికించి తెలుగుని చంపేస్తారని ఓ నెటిజన్ తన అభిప్రాయం తెలిపారు. ‘ఇలా చేసి, హిందీ వాడుక పెంచి అందరి మనసులో హిందీ కచ్చితంగా రావాలి అని నాటి, రేపటి రోజు ఈ సొంత నేల భాష అయిన తెలుగును పక్కన పెడతారు. ఏమీ లేకుండానే మనోళ్లు తెలుగుని పట్టించుకోరు ఇంకా ఇలా చేస్తే భాషకి ఇంత కూడా విలువ లేకుండా పోతుంది. ఏ నేల భాష ఆ నేల పై వాడండి.. అంటూ తెలుగువారు అనే యూజర్ దక్షిణ మధ్య రైల్వేకు సూచించారు. ట్వీట్ ఇదే..

Next Story