Bandla Ganesh: అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది.. బండ్లన్న సంబరం

by Disha Web Desk 10 |
Bandla Ganesh: అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది.. బండ్లన్న సంబరం
X

దిశ,వెబ్ డెస్క్: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వేళ ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది. ‘అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది? హ..హ..హ’ అంటూ బండ్ల గణేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన బండ్ల గణేష్.. డిసెంబర్ 9న మీరు కూడా ఎల్బీ స్టేడియంకు వస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగితే.. ‘నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9న రండి’ అని వెటకారంగా సమాధానం చెప్పారు. బండ్లన్న చెప్పిన సమాధానం బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు దాన్నే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ చూసి సంబరపడిపోవద్దు అన్నా.. కాస్త ఓపిక పట్టాలని కొంత మంది బండ్ల గణేష్‌కి సూచిస్తున్నారు. ‘ఇంకా ఫలితాలు రాలేదన్నా.. అప్పుడే ఎగరొద్దు’ అంటూ వెటకారంగా ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ టైమ్‌లో బండ్లన్న చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story