- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల చిన్న చిన్న కోరికలు తీరుస్తున్న ఫ్రీబస్ స్కీమ్.. నెటిజన్ పోస్ట్ వైరల్
తెలంగాణలో ప్రవేశపెట్టిన ఉచిత బస్ పథకం మహాలక్ష్మి వల్ల మహిళల చిన్న చిన్న కోరికలు తీరుతున్నాయంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రవేశపెట్టిన ఉచిత బస్ పథకం మహాలక్ష్మి వల్ల మహిళల చిన్న చిన్న కోరికలు తీరుతున్నాయంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వంశీ అనే నెటిజన్ ఈ పోస్ట్ షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పోస్టులో.. ఓ మహిళ హైదరాబాద్ నుండి కరీంనగర్ కు తన స్నేహితురాలి వివాహానికి వెళ్లిందని తెలిపాడు. అయితే తాను రూ.500 గిఫ్ట్ పెట్టాలని భావించగా మహాలక్షి పథకం ద్వారా ఉచిత ప్రయాణం దక్కడంతో టికెట్ డబ్బులు రూ.575 సేఫ్ అయ్యాయని దీంతో రూ.1000తో స్నేహితురాలికి గిఫ్ట్ ఇచ్చినట్టు తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా దాచుకున్న డబ్బును మహిళలు మహిళలు ఏమీ నల్లధనంలా స్విస్ బ్యాంకులకు తరలించరని తెలిపారు. దాచుకున్న డబ్బు మరో రూపంలో ఖర్చు చేస్తారని పేర్కొన్నారు. ఆ డబ్బుతో ఏమీ కోటీశ్వరులు అవ్వరని కానీ వారి చిన్నచిన్న కోరికలు తీర్చుకోగలరని తెలిపారు. అంతే కాకుండా ఈ పథకం ద్వారా ఆర్టీసీని కాపాడుకోగలం అని చెప్పారు. పథకం ద్వారా ఆర్టీసీకి ప్రభుత్వం నేరుగా డబ్బు చెల్లిస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పాటుపడుతూ ఆర్టీసీని కాపాడుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.






