"కవితక్క.. నిన్ను కేటీఆర్ ఇంకా బ్లాక్ చేయలేదా?"

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-14 12:07:06  IST  )

కర్మ హిట్స్ బ్యాక్ అని కవిత చేసిన పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినందుకే

కవితక్క.. నిన్ను కేటీఆర్ ఇంకా బ్లాక్ చేయలేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం వెల్లడైన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. కర్మ హిట్స్ బ్యాక్ అని ఆమె చేసిన పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసినందుకే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయిందనేందుకు కర్మ హిట్స్ బ్యాక్ అని పోస్ట్ పెట్టారని కొండరు అభిప్రాయపడుతున్నారు. ఆమెతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ రిజల్ట్ చెంపపెట్టు అని చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ యూజర్.. కవిత చేసిన ట్వీట్ పై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. "కవితక్క కేటీఆర్ ఇప్పటి వరకూ నిన్ను బ్లాక్ చేయలేదా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడు బ్లాక్ చేస్తారు" అని కామెంట్ చేశాడు. ఆ రిప్లై కి కూడా వేల వ్యూస్, ఇప్పటి వరకూ 80కి పైగా లైక్స్ రావడం గమనార్హం. నిజంగానే కవిత ట్వీట్ చూసిన కేటీఆర్ ఆమెను బ్లాక్ చేస్తారా? అని మరో చర్చ జరుగుతోంది.

Read More... Kavitha: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితంపై కవిత సంచలన పోస్ట్! వైరల్

Next Story