- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెహ్రూ వారసత్వంగా ప్రధాని కాలే.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ 'పాలసీ డాక్యుమెంట్'ను ఆవిష్కరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. విద్య, సాగునీటి (Education & Irrigation) రంగాలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో అనేక భారీ ప్రాజెక్టులు, ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయని పేర్కొన్నారు. నాడు దొరల ఆధీనంలో ఉన్న భూములను సైతం ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు.
హరిత విప్లవం ద్వారా ఆకలి తీర్చడమే కాదు.. దేశంలో సరిపడా ఆహార ఉత్పత్తి జరిగేలా చేశారన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందని వివరించారు. ఇందిరా గాంధీ పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని, ఆమె హయాంలో 'గరీబీ హఠావో', 20 సూత్రాల పథకం వంటివి మైలురాళ్లుగా నిలిచాయని తెలిపారు. ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం మత కల్లోలాలతో ఉందని.. ఆయన కేవలం వారసత్వంగా ప్రధాని కాలేదని రేవంత్ అన్నారు. విద్య, సాగునీటితోనే దేశం ముందుకు వెళ్తుందని నెహ్రూ నమ్మారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు నెహ్రూ, ఇందిరా గాంధీల సేవలు దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని, 1990 తర్వాతే భారత్ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు.






