- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో సిగాచి పరిశ్రమకు NDMA బృందం.. భద్రతా లోపాలపై అధ్యయనం
పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీ (Sigachi Pharma Company)లో రియాక్టర్ పేలిన ఘటన 42 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

దిశ, వెబ్‌డెస్క్: పాశమైలారం సిగాచి ఫార్మా కంపెనీ (Sigachi Pharma Company)లో రియాక్టర్ పేలిన ఘటన 42 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఘటన జరిగి 9 రోజులు గడుస్తున్నా.. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు స్పాట్ సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అయితే, సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదం జరిగిన స్పాట్‌కు వెంటనే వెళ్లాలంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA)కి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు, కాసేపట్లో ఎన్‌డీఎంఏ బృందం పాశమైలారంకు చేరుకోనుంది. వారు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SDMA)తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనున్నారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్, కెమికల్ అక్యుమిలేషన్‌పై సమగ్రంగా దర్యాప్తు చేపట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.






