- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా సభలో ఎన్‌సీసీ విద్యార్థుల నిరసన.. ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్డుల ప్రదర్శన
నిజామాబాద్‌లో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Nizamabad) నిజామాబాద్‌లో ఆదివారం (Turmeric Board) పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన రైతు మహా సమ్మేళన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొని ప్రసంగించారు. అయితే, ఏర్పాటు చేసిన సభలో కొంత మంది (NCC students) ఎన్‌సీసీ విద్యార్ధులు శాంతియుత నిరసన చేశారు. సేవ్ ఎన్‌సీసీ అంటూ భారత ఆర్మీలో, ఎన్‌సీసీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వారి ప్లకార్డులను లాగేసుకోని, విద్యార్థులను సభ నుంచి బయటకు పంపించి వేశారు. సభలో నిరసన తెలిపిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రం నినాయక్ నగర్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






