జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో(JubileeHills by-election) నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నడుస్తోంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక... నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో(JubileeHills by-election) నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నడుస్తోంది. భారీగా నామినేషన్లు రావడంతో స్క్రూటినీకి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ బై పోల్ లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. చాలా నామినేషన్లు వచ్చినప్పటికీ.. పోటీ ఇ రెండు పార్టీల మధ్యనే ఉండటంతో వీరి నామినేషన్ల పరిశీలపై ఉత్కంఠతగా ఎదురు చూసారు నాయకులు, కార్యకర్తలు.

అయితే తన నామినేషన్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసారని పేర్కొన్నారు. నామినేషన్లో అంతా కరెక్టుగానే ఉండటంతో ఎన్నికల అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. తాను ఎవ్వరినీ వ్యక్తిగతంగా దూషించనని, ఎవ్వరి నామినేషన్ మీద అభ్యంతరం చేయలేదని, అభివృద్ధే ఆయుధంగా ముందుకు వెళతానని అన్నారు. ఇటు మాగంటి సునీత మీద గోపినాథ్ మొదటి భార్య కొడుకు పలు ఆరోపణలు చేస్తూ.. ఆమె నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేసారు.

Next Story