ప్రకృతి ప్రళయం.. ఈ ఊరిని ఆదుకునేవారెవరు?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-29 13:10:27  IST  )

కామరెడ్డి జిల్లా కన్నాపూర్-పోల్కంపేట్ గ్రామాల్లో ప్రకృతి ప్రళయం తీవ్ర విధ్వంసం సృష్టించింది.

ప్రకృతి ప్రళయం.. ఈ ఊరిని ఆదుకునేవారెవరు?
X

దిశ, వెబ్ డెస్క్: కామరెడ్డి జిల్లా (Kamareddy) కన్నాపూర్-పోల్కంపేట్ గ్రామాల్లో (Kannapur) ప్రకృతి ప్రళయం తీవ్ర విధ్వంసం సృష్టించింది. వరద (Floods) ప్రవాహం పెరగటంతో సుమారు 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు కట్ట తెగిపోయింది. దీంతో చెరువు పూర్తిగా ఖాళీ అయింది. పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెరువులోని మట్టి పొలాల్లో పేరుకుపోవడంతో ఎవరి పొలం ఎక్కడుందో తెలియని దుర్భర పరిస్థితి ఏర్పడింది. తిరిగి భూమిని చదును చేయడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా, దాదాపు పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. గ్రామంలోకి వచ్చే బ్రిడ్జి కూడా ధ్వంసమై, గత మూడు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామ ప్రజలు చెరువు కట్ట తెగడం, పంటల నష్టం, ఇళ్లు కూలడం, రాకపోకలు ఆగిపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, నష్టపరిహారం, పునరావాసం, గ్రామంలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.

Next Story