- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే తెలంగాణ నం.1.. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా
తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే తెలంగాణ నంబర్ .1 గా ఉందని అల్కాలాంబా హర్షం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్రం మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా (Alka Lamba) డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. సొమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఐదు లక్షల మంది మహిళా కాంగ్రెస్‌లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని, అందులో తెలంగాణ నుంచే లక్షమంది ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకూ లక్షా 4 వేల మంది (Telangana Women's Congress) తెలంగాణ మహిళా కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడంతో దేశంలోనే తెలంగాణ నంబర్ .1 గా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
పదేళ్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉండి పోరాడుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సగం మహిళల పాత్ర ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశంలో రూ. 500 సిలిండర్ కేవలం తెలంగాణలోనే లభిస్తుందన్నారు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు మూడు హామీలు నెరవేర్చామని వెల్లడించారు. త్వరలో నాలుగో హామీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని పేర్కొన్నారు. దేశంలో మహిళా పెట్రోల్ బంక్ ఎక్కడా లేదని, తెలంగాణలోనే మొదటిసారిగా మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు అయిందని కొనియాడారు.
ప్రతి పోలింగ్ బూతులో ముగ్గురు మహిళలు
తెలంగాణలో ప్రతి పోలింగ్ బూతులో ముగ్గురు మహిళలను నియమించడానికి మహిళా కాంగ్రెస్ సిద్ధమవుతోందని తెలిపారు. నిన్న మహిళా కాంగ్రెస్ పూర్తిస్థాయిలో కార్యవర్గము ప్రకటించిందని, అందులో అన్ని జిల్లా అధ్యక్ష్యులు ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా, తెలంగాణ నుంచి మహిళలను ఢిల్లీలో ప్రియాంక గాంధీ సత్కరిస్తారని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి క్షేమం కోసం మహిళా కాంగ్రెస్ ప్రార్థిస్తుందోని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మాత్రమేనని, కాంగ్రెస్‌లో ఒకరికి ఒకపదవి అనే సిద్ధాంతం ఉందని, పార్టీ, ప్రభుత్వంలో మహిళా కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌తో మాట్లాడుతానని చెప్పారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో లక్ష్య సభ్యత్వం అయినందువల్ల జాతీయ మహిళా కాంగ్రెస్ ద్వారా రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సునీతా రావు (Sunita Rao)కి అల్కా లాంబా హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.






