- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి,

దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఎస్సీ గురుకుల విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలకు వెంటనే వివరణ ఇవ్వాలని ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి జాతీయ కమిషన్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపాయి.
గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లలు రూం క్లీన్ చేసుకోవడం, టాయిలెట్లు కడగటం చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. గురుకుల పిల్లలు పోష్ ఫ్యామిలీ నుండి రాలేదని, ఎవరొచ్చి చేస్తారని అన్నారు. వాళ్ల టేబుల్ మీదకు ఫుడ్ రాదు, రోటీలు చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిణి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మరోవైపు అధికారపార్టీ నాయకులు సైతం సీరియస్ అయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఇష్యూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు.






