- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు మోడీ సర్కార్ గుడ్‌న్యూస్! రాష్ట్రానికి రూ.176.5 కోట్లు.. జాతీయ రోడ్డు రవాణా శాఖ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు నిధులు ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం (Telangana) తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు రూ. 176.5 కోట్లు నిధులు ప్రకటించింది. (National Road Transport Department) జాతీయ రోడ్డు రవాణా శాఖ 'రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం' నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించింది. తెలంగాణ రాష్ట్రం పథకం ద్వారా మైల్ స్టోన్ 1 లో భాగంగా రూ.51.5 కోట్లు, మైల్ స్టోన్ 2 లో రూ.125 కోట్లు అర్హత సాధించింది.
అదేవిధంగా మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు రూ. 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అర్హత పొందింది. ఇక, మైల్ స్టోన్ 2 కింద, 15 ఏళ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేసే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం పంపింది.ఈ స్క్రాపింగ్ పథకంతో మరో 75 కోట్లు అర్హత పొందింది. 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు రూ. 31.5 కోట్లు, అలాగే రూ. 20 కోట్లు ప్రయారిటీ లేని జిల్లాల కోసం ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించనుంది.






