- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC : ఎస్ఎల్‌బీసీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్‌బీసీ (SLBC) సొరంగం ప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission) రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రమాదంలో గల్లంతైన కార్మికులను ఇంతవరకూ ఎందుకు బయటకు తీయలేదంటూ (NHRC) ప్రశ్నించింది. కార్మికుల మృతదేహాల వెలికితీత విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పందించాలని, 4 వారాల్లో చర్యలు చేపట్టి.. నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకి ఆదేశాలు జారీ చేసింది. మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కమిషన్ చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ఇంకా పరిహారం చెల్లించలేదని లాయర్ రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఎల్ఎల్‌బీసీ సొరంగంలో గత ఫిబ్రవరి నెలలో ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ప్రమాద ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో రెండు మృతదేహాలు మాత్రమే వెలికి తీశారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత రెండో డెడ్ బాడీ బయటకు తీసి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంకా ఆరుగురి మృతదేహాల ఆచూకీ లభించలేదు. ఘటన జరిగి 150 రోజులు అయినా ఇప్పటికీ కనీసం శవాలను ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది. టన్నెల్ లోపల ప్రమాదకర పరిస్థితులు, భారీగా మట్టి పేరుకుపోవటం, నీటి ఊట ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్లు గతంలో సంబంధిత అధికారి మీడియాకు తెలిపారు.






