వర్ష బీభత్సం.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన జాతీయ రహదారి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-28 04:58:40  IST  )

కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి.

వర్ష బీభత్సం.. కామారెడ్డిలో కొట్టుకుపోయిన జాతీయ రహదారి
X

దిశ‌, వెబ్ డెస్క్: కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ప‌లు కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవ‌డంతో ప‌లు రైళ్లు సైతం ర‌ద్ద‌య్యాయి. ఇక తాజాగా బిక్నూర్ ద‌గ్గ‌ర జాతీయ ర‌హ‌దారి సైతం కొట్టుకుపోయింది. దీంతో నాగ‌పూర్ వెళ్లే వాహ‌నాలు రాజీవ్ ర‌హ‌దారి క‌రీంన‌గ‌ర్ మీదుగా వెళ్లాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

అంతే కాకుండా ఆదిలాబాద్ నుండి హైద‌రాబాద్ వెళ్లే వాహ‌నదారులు కొండాపూర్ నుండి మామ‌డ‌, ఖానాపూర్, మెట్ ప‌ల్లి, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్ మీదుగా వెళ్లాల‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు నేడు కూడా జిల్లాలో వ‌ర్షం మొద‌లైంది. తెల్ల‌వారుజాము నుండి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షం కురుస్తోంది. రాజంపేట‌లో అత్య‌ధికంగా 44 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 30 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కామారెడ్డి చెరువుకు వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది.

Next Story