NAC ట్రైనర్ కు జాతీయ అవార్డు... మంత్రి కోమటి రెడ్డి హర్షం

by Muthe.Rajitha |

నైపుణ్యాలను నేర్పించేందుకు న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్ష న్)ను ఉత్తమ వేదికగా బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

NAC ట్రైనర్ కు జాతీయ అవార్డు... మంత్రి కోమటి రెడ్డి హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నైపుణ్యాలను నేర్పించేందుకు న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్ష న్)ను ఉత్తమ వేదికగా బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. న్యాక్ కు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రైన్యూర్షిప్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న స్నేహలత టీచర్స్ డే సందర్భంగా శుక్రవారం జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆమెను అభినందిస్తూ, హర్షం వ్యక్తం చేశారు. న్యాక్ సంస్థ ద్వారా ఇప్పటికే వేల మంది శిక్షణ పొందారని అన్నారు. ఇక నుంచి మరింత నాణ్యమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్ష న్(NAC) ను అత్యుత్తమ స్కిల్ డెవల్ మెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవల్ మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవల్మపెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ వేదికగా, జిల్లాల్లో న్యాక్ ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా..వంద శాతం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న స్నేహలత న్యాక్ ద్వారా నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని కొనియాడారు.

దేశ వ్యాప్తంగా 13 మంది ఈ వార్డుకు ఎంపికైతే రాష్ట్రం నుంచి న్యాక్ ఇన్ స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు అవార్డు రావడం రాష్ట్రానికి గర్వ కారణం అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడంతో ఫ్యాకల్టీ, సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతి శ్రీ ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అవార్డు అందుకున్న స్నేహలతకు న్యాక్ డైరెక్టర్ జనరల్(డీజీ), ప్రభుత్వ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ అభినందనలు తెలిపారు.

Next Story