- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెంట్రల్లో క్రైసిస్ ఛాన్స్.. 'యాంటీ బీజేపీ ఫ్రంట్' ఏర్పాటుకు సీపీఐ చర్చలు: నారాయణ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం భారతదేశ న్యాయవ్యవస్థ వీరాభిమన్యుడిలా పోరాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం భారతదేశ న్యాయవ్యవస్థ వీరాభిమన్యుడిలా పోరాడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) పేర్కొన్నారు. అంతిమంగా ఈ జ్యుడీషియరీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని విశ్వాసం ఉందని నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఒకవైపు రాష్ట్రపతిని, ఎన్నికల కమిషన్‌ని కేంద్రంలోని (BJP) బీజేపీ ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకుందని, మరోవైపు ఈసీ, ఈడీ, సీబీఐని గ్రిప్‌లో పెట్టుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. జ్యుడీషియరీ ఒకటే న్యాయాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తోందని, నామినేటెడ్ గవర్నర్లుగా నియమించబడిన వారు ఎన్నికైన ప్రభుత్వాలను శాసిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తమిళనాడు గవర్నర్ బహిరంగంగానే ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల పాలక ప్రభుత్వాలపై దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఎన్నికైన ప్రభుత్వాలని గౌరవించాలని జ్యుడీషియరీ కూడా చెబుతున్నప్పటికీ, అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనటం విచారకరమని హాట్ కామెంట్స్ చేశారు. దేశంలోని ప్రధాన బాడీల్లో రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, జ్యుడీషియరీ, నీతి ఆయోగ్, సీబీఐ ప్రధానమైనవి అని, ఇందులో నాలుగింటిని మోడీ సర్కార్ మింగేసిందన్నారు. ఇందులో జ్యుడీషియరీ మాత్రమే మిగిలిందని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రజాస్వామ్యం కిందిస్థాయిలో చాలా బలంగా మిగిలి ఉందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చారిత్రక నేపథ్యం ఇంకా దేశంలో మిగిలి ఉందన్నారు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని, జ్యుడీషియరీని కాపాడుకునేందుకు తప్పనిసరిగా పోరాడుతామని తేల్చిచెప్పారు. సెంట్రల్‌లో కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని అధిగమించాలంటే దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకత్రాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై సీపీఐ చర్చిస్తోందని, సెప్టెంబర్ 22 నుంచి చంఢీగర్‌లో జరిగే జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన (anti-BJP front) 'యాంటీ బీజేపీ ఫ్రంట్' ఏర్పడే దిశగా కృషి చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.






