- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ambati Rambabu : నారా లోకేష్ ఓ పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు
టీడీపీ ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ఓ పెద్ద పప్పు సుద్ద అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శించారు. మీ నాన్నని చూసి అందరు నీకు గౌరవిస్తున్నారని లోకేష్ తెలుసుకోవాలని గుర్తు పెట్టుకోవాలన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ఓ పెద్ద పప్పు సుద్ద అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) విమర్శించారు. మీ నాన్నని చూసి అందరు నీకు గౌరవిస్తున్నారని లోకేష్ తెలుసుకోవాలని గుర్తు పెట్టుకోవాలన్నారు. నీవు కోడిగుడ్డు అని ఎద్దేవా చేసిన మా నాయకుడు అమర్నాథ్ ఓ మాజీ మంత్రి కొడుకు అని..వాళ్ల నాన్న లేకపోయినా అమర్నాథ్ తగిన గౌరవం పొందుతున్నాడని అంబటి స్పష్టం చేశారు. కాని నీవు మీ తండ్రి లేకపోతే సుద్ద పప్పువని లోకేష్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు. లోకేష్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైసీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేరని జగన్ ఆనాడే చెప్పారన్నారు. ఇవ్వాళ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడని మాట్లాడుతున్నాడని రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసపూరిత హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని, వైసీసీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశాడని..ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనే వైసీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని చంద్రబాబుఎలా చెబుతారని రాంబాబు నిలదీశారు.
చంద్రబాబు అసమర్దత వల్లే పెట్టుబడులు రాలేదని, రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కొడుకుతో, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ చేసుకోలేకపోయారని విమర్శించారు. పైగా తన దావోస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దావోస్ ఎంఓయూలు మిధ్య అంటూ చెప్పడం సిగ్గుచేటని. అలాంటప్పుడు ఆయన దావోస్ ఎందుకు వెళ్లారని నిలదీశారు. సీఎంగా జగన్ హాయంలో రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు . టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచ్చినవేనని రాంబాబు తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు.






