- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండా సురేఖ రాజీనామా చేయాలి : నన్నపనేని నరేందర్
గులాబీ పార్టీ మాజీ నన్నపనేని నరేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా ఆమెను డిస్మిస్ చ

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ మాజీ నన్నపనేని నరేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా ఆమెను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు నన్నపనేని నరేందర్. రూ.70 కోట్లు ఖర్చు చేసి గెలిచామని కొండా మురళి చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు. కొండా దంపతులు ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేశారని మండిపడ్డారు. కొండా మురళి మాటలకు సురేఖ సమాధానం చెప్పాలన్నారు నన్నపనేని నరేందర్.
ఇది ఇలా ఉండగా మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి హరి సింగ్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి గెలవడం అనైతికమని వెల్లడించారు నన్నపనేని నరేందర్.






